HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. SRH యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

New Update
Revanth Reddy Serious

Revanth Reddy Serious Photograph: (Revanth Reddy Serious )

HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. SRH యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. SRH యాజమాన్యాన్ని పాసుల విషయంలో HCA బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. SRH యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!

ఉచిత పాస్‌ల కోసం..

ఇదిలా ఉండగా ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ను హెచ్ సీఏ తీవ్రంగా వేధిస్తోందిట. ఈ బాధలు ఎస్ఆర్హెచ్ పడలేకపోతోంది. దీనికి తోడు కోరినన్ని పాస్ లు ఇవ్వలేదని ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్‌ బాక్స్‌కు హెచ్సీఏ తాళాలు కూడా వేసిందని సన్ రైజర్స్ చెబుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ హెచ్‌సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్‌ ప్రతినిధి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ బాధలు ఇక పడలేమని...అందుకే తాము హైదరాబాద్ ను వదిలి వెళ్ళిపోతామని  ఎస్ఆర్హెచ్ చెబుతోంది. 

ఇది కూడా చూడండి:  Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే

హెచ్సీఏ చేస్తున్న బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ల మీద  సన్ రైజర్స్ ఓ లేఖ రాసింది. దీనిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పన్నెండేళ్ళుగా హెచ్సీఏ కలిసి పని చేస్తున్నాం. కానీ లాస్ట్ రెండేళ్ళుగా చాలా వేధిస్తున్నారు. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు 10 శాతం అంటే 3900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం.

ఇది కూడా చూడండి:  Ram Charan Daughter: వావ్..! అమ్మ, నానమ్మతో క్లింకార ఎంత ముద్దుగా పూజ చేస్తుందో.. ఉపాసన వీడియో వైరల్

50 సీట్ల సామర్థ్యం ఉన్న ఎఫ్‌12ఏ కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్లు కూడా అందులో ఉన్నాయి.  కానీ ఈ ఏడాది అది కాస్త తగ్గింది.  30 సీట్లే ఉన్నాయని...అదనంగా మరో 20 సీట్లు కావాలని అడిగారు. దీనిపై చర్చిద్దాం అని చెప్పాం. కానీ మాకు ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వకుండా హెచ్సీఏ దారుణంగా ప్రవర్తించిందని లేఖలో రాశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్, మెదక్, వికారాబాద్,  మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి!

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో జల్లులు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది. 

Also Read: భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

 

Advertisment
Advertisment
Advertisment