Harish Rao : జగిత్యాల సభకు హరీష్‌రావు డుమ్మా..హుటాహుటిన ఢిల్లీకి పయనం..ఎందుకో తెలుసా?

జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో, ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీశ్ రావు అనూహ్యంగా ఢిల్లీకి పయనమవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

New Update
Harish Rao PowerPoint Presentation

harishrao

Harish Rao : తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా అత్యంత వేడెక్కాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు మాజీ సీఎం కేసీఆర్(brs-chief-kcr) పోటాపోటీ సభలతో రాజకీయ వాతావరణం అట్టుడుకుతోంది. అయితే, జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో, ఆ పార్టీ కీలక నేత తన్నీరు హరీశ్ రావు(harishrao) అనూహ్యంగా ఢిల్లీకి పయనమవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనతో పాటు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ వినోద్ కుమార్‌(vinod-kumar) కూడా హస్తినాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read :  కాంగ్రెస్ కు బిగ్ షాక్.. జీవన్ రెడ్డితో పాటు BRSలో చేరే కీలక నేతల లిస్ట్ ఇదే!

Harish Rao Dumma's Visit To Jagityala Sabha

హరీశ్ రావు అత్యవసర ఢిల్లీ పర్యటన వెనుక ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, తన తీర్పును ఎల్లుండి (ఏప్రిల్ 22) వెల్లడించనుంది. ఈ తీర్పు బీఆర్ఎస్ నేతల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

హైకోర్టు తీర్పు ఒకవేళ తమకు వ్యతిరేకంగా వస్తే, తక్షణమే దానిని సుప్రీంకోర్టు(suprime court) లో సవాల్ చేయాలని బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరిపేందుకు, ముందస్తుగా 'కావియట్' దాఖలు చేయడం వంటి అంశాలపై న్యాయ సలహాలు తీసుకునేందుకు హరీశ్ రావు ఢిల్లీ వెళ్లారని సమాచారం. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి కమిషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని, వాటిని ఉదహరిస్తూ బలమైన వాదనలు సిద్ధం చేయాలని ఆయన యోచిస్తున్నారు.

కేసీఆర్ బహిరంగ సభ జరుగుతున్న సమయంలోనే పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఢిల్లీలో ఉండటం వెనుక పక్కా రాజకీయ, న్యాయపరమైన వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి హైకోర్టు ఈ తీర్పును ఏప్రిల్ 8నే ఇవ్వాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఎల్లుండికి వాయిదా పడింది. ఏప్రిల్ 22న వచ్చే కోర్టు తీర్పు ఆధారంగానే బీఆర్ఎస్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించనుంది. ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తూనే, మరోవైపు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడేందుకు గులాబీ దళం శ్రమిస్తోంది.

Also Read :  సోషల్ మీడియా వేదికగా వలపు వల...మైనర్లను బెదిరించి లక్షల్లో వసూలు

Advertisment
తాజా కథనాలు