/rtv/media/media_files/2025/03/12/jVZCXfcHZTAIqUqPYzcp.jpg)
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో కూర్చున్న కేసీఆర్ వద్దకు వెళ్లిన గూడెం .. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని స్వయంగా అహ్వానించారు. కేసీఆర్ కూడా తప్పకుండా వస్తానని చెప్పినట్లు సమాచారం.
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీపై అసభ్యపదజాలంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంతకుముందు తన ఆఫీసులో రేవంత్ ఫోటో పెట్టుకోను అంటూ కామెంట్స్ చేశారు గూడెం. స్థానికంగా కాటా శ్రీనివాస్ నుంచి సెగ తగులుతుండడంతో.. గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉండలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. సోదరుడి వివాహం తర్వాత బీఆర్ఎస్‌లోకి తిరిగి వచ్చే ప్లాన్‌లో గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.