/rtv/media/media_files/2025/01/27/1lNE3cgfnHre8pc25Os9.jpg)
Rythu Bharosa
Raithu Bharosa : తెలంగాణ రైతులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 20న రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వీటిని విడుదల చేస్తారు. ఎకరానికి రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ కానున్నాయి. రెండవ విడత1.5 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందనుంది. రెండో విడతలో 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయి.
కాగా, తొలి విడతలో భాగంగా మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన బహిరంగ సభలో 1.50 కోట్ల ఎకరాలకు రూ.3,590 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం లో ఈ నెల 20న భారీ బహిరంగ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసిన సర్కార్, ఇప్పుడు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తుండటం గమనార్హం.
Follow Us