/rtv/media/media_files/2025/02/14/FqwL9ZUzlVfJVm2Y9ujo.jpg)
TGSRTC
గో రూరల్ ఇండియా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అటాచ్ చేశారు. ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. అయితే ఈ గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనలకు గో రూరల్ ఇండియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా వేరే సంస్థలకు ఇచ్చినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. M/s GRIPL, M/s Poster Town India Pvt Ltd, M/s Go Transit Media Pvt Ltd, M/s Lime Lite Advertising Pvt Ltd లాంటి కంపెనీల ద్వారా వ్యాపారం చేసినట్లు గుర్తించారు.
Also Read: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన
వినియోగదారుల నుంచి వచ్చిన కోట్లాది రూపాయలను తమ సొంత ఖాతాల్లోకే మళ్లించుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.21.72 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆ డబ్బును వివిధ పెట్టుబడులకు ఉపయోగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also Read: పంజాబ్‌కే అక్రమ వలసదారులను అమెరికా ఎందుకు పంపిస్తోంది ?