/rtv/media/media_files/2025/04/02/ReQnRM6dTXUc74SSfWCH.jpg)
German woman Rape Case
హైదరాబాద్‌లో నిన్న దారుణం జరిగింది. నగరాన్ని సందర్శించడానికి వచ్చిన ఓ జర్మనీ యువతిపై కారు డ్రైవర్ అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అస్లాంగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
ఏం జరిగిందంటే?
హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు.. బాధితురాలితో పాటుగా జర్మనీలో చదువుకున్నాడు. అతగాడి కోసం మార్చి తొలి వారంలో జర్మన్ యువతి హైదరాబాద్ వచ్చింది. అనంతరం తమ స్నేహితుడి ఇంట్లో ఉంటూ నగరాన్ని సందర్శించింది. నగరం మొత్తం తిరిగిన తర్వాత తిరిగి తమ దేశానికి వెళ్లిపోయేందుకు ఆ యువతి రెడీ అయింది.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా.. కారు డ్రైవర్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మామిడిపల్లి వద్ద చోటుచేసుకుంది. ఆపై బాధితురాలు తన స్నేహితుడితో కలిసి పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి గురించి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో బాగంగానే ఆ నిందితుడ్ని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
(crime news | germany attack news | latest-telugu-news | telugu-news)