/rtv/media/media_files/2025/04/02/QzSNxgFjdL3LE3sRrzE0.jpg)
Hyderabad youth rapes German tourist inside car DCP Sunitha reconstructs
హైదరాబాద్‌లో నిన్న జర్మనీ యువతిపై ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి.. తాజాగా ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు అస్లాంను అరెస్టు చేశారు. అనంతరం మొదటి నుంచి ఆఖరి వరకు జరిగిన సంఘటనను పోలీసులు రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
ఇందులో భాగంగానే జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. HYD లో అందమైన ప్రదేశాలు చూపిస్తామని సోమవారం సాయంత్రం 6 గంటలకు అస్లాం తన కారులో యువతి, ఆమె స్నేహితుడిని ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి యాకుతురా, చార్మినార్ మొత్తం తిప్పాడు. అనంతరం సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్‌ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి ఎవరూ లేని ప్రాంతంలో కారు ఆపై ఆమెపై అత్యాచారం చేశాడు.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఏం జరిగిందంటే?
మార్చి తొలి వారంలో జర్మన్ యువతి తన స్నేహితుడి కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడే స్నేహితుడి ఇంట్లో ఉంటూ నగరాన్ని సందర్శిస్తుంది. అనంతరం మరిన్ని ప్రాంతాలు తిరగడానికి ఆ యువతి, తన స్నేహితుడు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే నగరాన్ని చూపిస్తానంటూ జర్మనీ యువతి, ఆమె ఫ్రెండ్‌ని అస్లాం అనే వ్యక్తి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆపై ఓ మంచి ప్రదేశం కనిపించగా.. ఫోటోలు దిగేందుకు ఆ యువతి స్నేహితుడు కారు నుంచి దిగాడు.
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
అదే సమయంలో కార్ యూటర్న్ తీసుకొద్దామని క్యాబ్ డ్రైవర్ అస్లాం.. జర్మనీ యువతిని కారులో కొద్ది దూరం తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని ప్రదేశంలో అస్లాం ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో ఆ జర్మనీ యువతి తన స్నేహితుడితో కలిసి పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ అస్లాంను అరెస్టు చేశారు.
(German woman | latest-telugu-news | crime news | HYD Crime | HYD Rape Case )