/rtv/media/media_files/2026/04/10/latest-news-in-telugu-2026-04-10-18-14-00.jpg)
Gaddapotharam industrial area fire accident
Fire Accident : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రల్ రసాయన పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. భారీగా ఎగిసి పడుతున్న అగ్ని కీలల మూలంగా పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ ప్రమాదం షార్ట్ సర్య్కూట్ వల్ల చోటు చేసుకుందా? మరేదైనా కారణం అనేది తేలాల్సి ఉంది. అలాగే ప్రమాదం మూలంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది, అలాగే ప్రమాదంలోఎవరైనా చిక్కుకున్నారా అనేది ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us