/rtv/media/media_files/2025/03/27/xL3dNXb7OD5UdEKbabUE.jpg)
Car on fire
Car on fire : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ స్టేజి సమీపంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేసారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడాన్ని గమనించిన రాజశేఖర్ రెడ్డి వెంటనే బయటకు దిగాడు. డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి గుర్తించి బయటకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు కారు యజమాని తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.