BIG BREAKING: మహాత్మ గాంధీ యూనివర్సిటీలో భారీ అగ్నిప్రమాదం
నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 100 ఎకరాల్లో వృక్ష సంపద కార్చిచ్చు వల్ల కాలిపోయింది. సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 100 ఎకరాల్లో వృక్ష సంపద కార్చిచ్చు వల్ల కాలిపోయింది. సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసలు మంటలు ఎలా చెలరేగాయో అనేదానిపై స్పష్టతం లేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .
ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కొండపల్లి సమీపంలోని ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ (NTTPS) కోల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో కోల్‌ప్లాంట్ టీపీ-94ఏ2 బెల్టు దగ్గర మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. NTTPS అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. వారి నిర్లక్ష్యం కారణంగా స్టేజ్-1 బంకర్‌కి వెళ్లే కన్వేయర్ బెల్ట్.. 40 మీటర్ల మేర మంటలతో దగ్ధమయ్యాయి.
ఇక ఈ నెల మొదటివారంలో హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా కట్టిన అంబర్‌పేట్ కొత్త ఫ్లై ఓవర్‌ను దట్టమైన పొగ కమ్మేసింది. వాహనదారులు, స్థానికులు దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఫైఓవర్ కింద గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి గోడౌన్‌లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది.
🔴Live News Updates: ఈ రాశులవారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి...!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Horoscope:ఈ రాశులవారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి...!
వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు..మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
horoscope
మేషరాశివారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో నిరుత్సాహంగా ఉంటారు. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టవద్దు. కుటుంబంలో ఏర్పడే చిన్న సమస్యల గురించి పట్టించుకోవద్దు.
వృషభరాశివారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు. ప్రయాణాలు ఫలవంతం. తీర్ధయాత్రలలో పాల్గొని ఆధ్యాత్మికంగా గడపడం ప్రశాంతతనిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునరాశివారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలకు ఈ రోజు గొప్పగా ఉంటుంది. మీరు పట్టింది బంగారం అవుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంది ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి.
కర్కాటకరాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండండి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. కొన్ని ఇబ్బందికర సంఘటనల నుంచి బయట పడతారు.
సింహరాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు, శ్రమ పెరుగుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. బంధువులతో కలహాలు, మనస్పర్థలు పెరగకుండా జాగ్రత్త పడాలి.
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. మీ నైపుణ్యాన్ని చూసి అంతా ప్రశంసిస్తారు. అధికారుల సహాయసహకారాలు అందుకుంటారు. బంధుమిత్రులతో తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు.
వృశ్చికరాశివారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా ఉంటారు. మీ విరోధులు ఈ రోజు ఓటమిని అంగీకరిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. ఆర్ధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. పెండింగు పనులు పూర్తిచేస్తారు.
ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన జాప్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఈ రోజు మీ సహనానికి పరీక్షగా ఉంటుంది. ప్రయాణాల్లో చోరభయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా విచారంగా, నిరుత్సాహకరంగా ఉంటారు. సామాజిక, ధార్మిక కార్యకలాపాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. సంపద, ప్రతిష్ఠకు నష్టం కలిగే సూచనలున్నాయి.
కుంభరాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ధర్మబద్ధంగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపించకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సన్నిహితులతో వివాదాలకు అవకాశం ఉంది. మనోధైర్యం కోల్పోకుండా చూసుకోండి. వృత్తి ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయవద్దు.
Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్ చీఫ్!
ఆఫ్గానిస్తాన్ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖున్ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.
అనికేత్ వర్మ మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తల్లిని కోల్పోయాడు. తల్లి మరణం తరువాత, అతని తండ్రి మళ్ళీ వివాహం చేసుకున్నాడు. దీంతో అతని మేనమామ అనికేత్ బాగోగులు చూసుకున్నాడు. అతనికి 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదటిసారి క్రికెట్ అకాడమీలో చేర్పించాడు.
aniket-varma
Mar 31, 2025 07:18 IST
Exam fee : ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలేదు.. ఎంత బతిమిలాడిన పట్టించుకోకపోవడంతో
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు రూ. 800 చెల్లించలేదని పాఠశాల యజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య 13 ఏళ్ల బాలిక రియా ప్రజాపతి చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.