Hyderabad Fire Accident : హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం..ముగ్గురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ పాతబస్తీ చార్మినార్ సమీపంలోని ఒక బుర్ఖా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. షహ్రాన్ మార్కెట్‌లో ఉన్న బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
FotoJet (40)

Hyderabad Fire Accident

Hyderabad Fire Accident :  హైదరాబాద్‌ పాతబస్తీ చార్మినార్ సమీపంలోని ఒక బుర్ఖా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చార్మినార్ దగ్గర గల షహ్రాన్ మార్కెట్‌లో ఉన్న బుర్ఖా దుకాణం మూడవ అంతస్తులో మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సమయానికి అక్కడి చేరుకున్న ఫైరింజన్‌ తో మంటలను ఆర్పివేశారు. అనంతరం పోలీసులు  సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో గాయపడిన ముగ్గురిని వైద్య చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
అసలేం జరిగిందంటే...

మీర్‌చౌక్ పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. చార్మినార్ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌‌లో ఉన్న ఒక వాణిజ్య  భవనం మూడో అంతస్తులో బుర్ఖా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. రోజులాగే అందరూ పనిలో ఉండగా ఆ దుకాణంలో ఉపయోగిస్తున్న మినీ గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట చిన్నగా ప్రారంభమైన మంటలు ఒక్కసారిగా విస్తరించాయి. దీంతో అందులో పనిచేస్తు్న్నవారు అక్కడే చిక్కుకుపోయారు.  క్రమంగా మంటలు పెరిగి దుకాణంలోని వస్తువులకు వ్యాపించింది. దీంతో అక్కడ ఉన్నవారు  భయంతో బయటకు పరుగులు తీశారు.

అగ్ని ప్రమాదంలో  దుకాణంలో  పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. రంజాన్ మాసం కావడంతో మార్కెట్ ప్రాంతం చాలా రద్దీగా ఉంది. దీంతో  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది.  

Advertisment
తాజా కథనాలు