USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు.

New Update
USA Road Accident

USA Road Accident

USA Road Accident : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు.రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35) వియ్యపురాలు సునీత రెడ్డి (56)తో పాటు మనుమడు ఆరేళ్ల హర్వీన్‌ రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు

భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్లోరిడాలో ఈ ప్రమాదం జరిగినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన రోహిత్‌ రెడ్డితో.. ప్రణీతరెడ్డికి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కుమార్తెను చూసేందుకు అత్త సునీత అమెరికా వెళ్లారు. అత్త సునీతతో కలిసి ప్రణీతరెడ్డి, రోహిత్‌ రెడ్డి, ఇద్దరు పిల్లలు కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రణీత, పెద్ద కుమారుడు హర్వీన్, రోహిత్‌ రెడ్డి అత్త సునీత అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రోహిత్‌ రెడ్డితో పాటు వారి చిన్నకుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడుపుతున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోహిత్ రెడ్డి కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కును ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. తమ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. తమ గ్రామవాసులు జీవితం ఇలా విషాదకరంగా ముగియడంతో టేకులపల్లిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, 15 సంవత్సరాల క్రితమే అమెరికాకు వలస వెళ్లినట్లు వారి బంధువులు చెబుతున్నారు. 

Also Read: మండుతున్న ఎండల్లో ఓ చల్లని వార్త...ఈ నెల 21 నుంచి...

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sri Rama navami: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు

భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది.

New Update

భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది. అయితే మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకించనున్నారు.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

Bhadrachalam temple

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 

Advertisment
Advertisment
Advertisment