/rtv/media/media_files/2025/02/19/bfVWYFxKNy0gUJJnd0Iq.webp)
command control center
Command Control Center: హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ ఉద్యోగుల బెడద కలకలం సృష్టిస్తోంది. ఇటీవల తెలంగాణ సచివాలయంలోనూ ఇద్దరు నకిలీ ఉద్యోగులను అధికారులు పట్టుకున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి (సీసీసీ) గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించడం తీవ్ర చర్చకు దారితీసింది. అది కూడా మూడుసార్లు రాకపోకలు సాగించి సీసీసీ భద్రతను సవాలు చేశాడు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం..
సీసీసీ కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరించిన సదరు వ్యక్తిని గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మొదట అతను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకున్నా, చివరకు ఆ ఫేక్ ఉద్యోగి జ్ఞాన సాయి ప్రసాద్ గా పోలీసుల విచారణలో తెలిసింది.
Also Read : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!
జ్ఞాన సాయి ప్రసాద్ సీసీసీ సెంటర్ ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల పేరుతో గోవర్ధన్ అనే వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. గోవర్ధన్ నుంచి జ్ఞాన స్థాయి ప్రసాద్ మూడు లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
సీఎం సమీక్షలు జరుగుతున్న సమయంలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి మూడుసార్లు రావడం, తిరిగి వెళ్లడం పై అధికారులు తీవ్రంగా స్పందించారు. హోటల్‌తో పాటు సీసీసీ సెంటర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞాన సాయి ప్రసాద్ వెళ్లిన హోటల్‌తో పాటు సీసీసీలోని సీసీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు సేకరించారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలను త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారు.
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
Also Read: Mamata Benarjee: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్