/rtv/media/media_files/2025/03/06/L5UwAWnqCdN6FVlHBnzt.jpg)
heatwave Photograph: ( heatwave)
నిప్పులు చెరిగే ఎండలు, తీవ్ర వడగాలులతో ఈ వేసవిలోనూ సూర్యుడి భగభగలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లుగా ఈ సారి ఫిబ్రవరి చివరివారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను చేరుకుంది. రాష్ట్రంలోని 301 మండలాలు హీట్ వేవ్స్ నమోదయ్యే ప్రాంతంలో ఉన్నాయని,వడగాలుల ముప్పు సైతం పొంచి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది.
Also Read:Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
తెలంగాణ ప్రాంతం మెట్ట నేలలతో ఉండటంవల్ల భూమి త్వరగా వేడెక్కుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ భూములు ఎక్కువగా ఉండటంతో అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దక్షిణ తెలంగాణలోని కొన్నిజిల్లాల్లోనూ ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి.
Also Read: BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
రాజస్థాన్ నుంచి గాలులు..
వేసవిలో రాజస్థాన్ నుంచి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటమూ వేడి పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4.5 డిగ్రీల నుంచి 6.4డిగ్రీల వరకు పెరిగినప్పుడు ,ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటినప్పుడు దానిని హీట్ వేవ్ గా చెబుతారు.
ఈ జోన్ లో ఆదిలాబాద్,నిర్మల్ , జగిత్యాల,కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల,పెద్దపల్లి, కరీంనగర్,వరంగల్,మహబూబాబాద్, ములుగు,ఖమ్మం,సూర్యాపేట,నల్గొండ జిల్లాలు ఉన్నాయి.
రాష్ట్రంలో అత్యంత తీవ్ర వడగాలులు ముప్పున్న ప్రాంతాల్లో 9.98 లక్షల మంది తీవ్ర ముప్పున్న ప్రాంతాల్లో 50.64 లక్షల ,ముప్పున్న ప్రాంతాల్లో 1.06 కోట్ల మంది జీవిస్తున్నట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో దశాబ్ద కాలంలో వడదెబ్బతో 1,403 మంది మృత్యువాత పడ్డారు.
2015లో అత్యధికంగా 541 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుబయట పని చేసే కూలీలకు కార్మికులకు ,ప్రయాణాలు చేసేవారికి, వృద్దులకు, మూత్రపిండాల వ్యాధుల బాధితులకు వడదెబ్బ ముప్పు ఎక్కువ.