TG News: తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారా హిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకబడుతున్నారని, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇదేం విడ్డూరం.. ఇదెక్కడి న్యాయం? .. ఇదేం ప్రజాస్వామ్యం? రేవంత్ మీ పాలన మార్పు ఇదేనా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. Also Read: ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ఆవిష్కరణ.. ఎలా అప్లై చేసుకోవాలంటే! అక్రమ కేసులపై ఆగ్రహం: రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్‌గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు.. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నావని ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది, బెదిరేది లేదంటూ హెచ్చరించారు. ప్రజా క్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం అటూ ధ్వజమెత్తారు.Also Read: షుగర్‌ను అద్భుతంగా కంట్రోల్ చేసే ఆకు ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా? అక్రమ అరెస్టు, ప్రభుత్వ తీరు పట్ల సీఎం రేవంత్‌రెడ్డిని హరీష్ రావుని ప్రశ్నించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దారుణం అని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు చేస్తే బీఆర్ఎస్ భయపడేది లేదంటూ తేల్చి చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని సీఎంపై మండపడ్డారు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుందని హరీస్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: అధిక రక్తపోటును అదుపులో ఉంచే అద్భుత పండు Also Read: భారత్‌లో కొందరు మాత్రమే తినే మిరపకాయ