/rtv/media/media_files/2025/03/08/tNeLaFMDwM1fnmY8NGAp.jpg)
DSP Jawaharlal dies in road accident in Siddipet district
తరచూ రోడ్డు ప్రమాదాలు మృతుల కుటుంబాలకు విషాదాన్ని మిగుల్చుతున్నాయి. అతి వేగం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదుపు తప్పిన వాహనాన్ని కంట్రోల్ చేయలేక రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. అదే సమయంలో రోడ్డుపై ప్రయాణించే ఇతర ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు చాలానే ఇలాంటి సంఘటనలు జరిగాయి.
Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
తాజాగా మరొకటి అలాంటిదే జరిగింది. అయితే ఇక్కడ అడ్డంగా వచ్చిన కారును తప్పించబోయి ఒక డీఎస్పీ తన ప్రాణాలను విడిచారు. అతడు ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా మరొక వాహనం వచ్చింది. అదే సమయంలో వారిని కాపాడబోయి ఆయన తన ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం చిన్న కృష్ణాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
డీఎస్పీ జవహర్‌లాల్ మృతి
సంగునూరు మండలం రాజగోపాలపేట ఫైరింగ్ రేంజ్‌కు మేడ్చల్ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపల్, డీఎస్పీ జవహర్‌లాల్(50) శుక్రవారం ఉదయం కారులో వెళ్లారు. అక్కడ ఫైరింగ్ టెస్ట్ పూర్తి చేసుకున్నారు. అనంతరం తిరిగి ప్రయాణం అయ్యారు. అలా కారులో వస్తుండగా.. చిన్నకిష్టాపూర్ క్రాస్‌రోడ్డులో ఒక్కసారిగా మరొక కారు అడ్డంగా వచ్చింది.
Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!
ఏం చేయాలో తెలియక డీఎస్పీ కారు డ్రైవర్ అడ్డంగా వచ్చిన కారును తప్పించబోయి ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ కారు రోడ్డుపక్కన ఉన్న హోర్డింగ్ బోర్డును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనకసీట్లో కూర్చున్న డీఎస్పీ జవహర్‌లాల్ తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లు, చేతులు, తల, ఛాతి భాగాల్లో బాగా దెబ్బలు తగిలాయి.
అలాగే డ్రైవర్ శ్రవణ్‌కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వీరి వెనక వస్తున్న వాహనంలో ఉన్న ఆర్‌ఎస్‌ఐ రాజేశ్ క్షతగాత్రులను ములుగు సమీపంలోని ఆర్వీఎం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డీఎస్పీ జవహర్‌లాల్ కన్నుమూశారు. కారు డ్రైవర్ శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.