Devara : ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

దేవర ప్రీ రిలీజ్‌ రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు.

author-image
By B Aravind
New Update
DEVARA

Devara Pre-Release Event Cancelled : దేవర ప్రీ రిలీజ్‌ రద్దయింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహిస్తున్న ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొంతమంది హోటల్ అద్దాలను అభిమానాలను కూడా ధ్వంసం చేశారు. రంగలోకి దిగిన పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. చివరికి అభిమానులను కంట్రోల్ చేయడం అసాధ్యమని భావించిన పోలీసులు, నిర్వాహకులు, నోవాటెల్ సిబ్బంది ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తితో వెనుదిరిగారు. 

ఎన్టీఆర్‌ హీరోగా డైరక్టర్‌ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నోవాటెల్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ అభిమానుల అత్యుత్సాహంతో ఇది రద్దయ్యింది.

Also Read :  ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం...వారందరికీ పింఛన్లు కట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు