/rtv/media/media_files/2026/04/11/inter-2026-04-11-15-14-47.jpg)
Telangana Inter Results - Day After Tomorrow
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసి రిజల్ట్స్(telangana inter results 2026) కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్ల వారి ఎదురు చూపులకు ఇక తెరపడినట్లే. తాజాగా వెలువడ్డ సమాచారం ప్రకారం, రాష్ట్ర విద్యాశాఖ ఏప్రిల్ 12న (ఆదివారం) ఇంటర్ ఫలితాలను వెల్లడించేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇంతలోనే మరో వార్త కూడా మీడియా సర్కిళ్లలో చక్కర్ కొడుతుంది. అదెంటంటే పలు జాతీయ స్థాయి నివేదికల ప్రకారం ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 11న శనివారం కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు పూర్తి చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్లు అయిన tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లలో హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
Also Read : తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్..?
Telangana Inter Results - Day After Tomorrow
కాగా,,గత కొన్నేళ్లుగా ఇంటర్ ఫలితాల ప్రక్రియను బోర్డు(telangana-inter-board) మరింత వేగవంతం చేసింది. పేపర్ వాల్యుయేషన్ ముగిసిన వెంటనే సాంకేతిక పరమైన మార్కుల క్రోడీకరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయడంతో పాటు, నిర్ణీత గడువు కంటే ముందే ఫలితాలు వెల్లడించే ప్రయత్నం చేస్తోంది. అదేకాక ఆదివారం ఫలితాలు విడుదల చేస్తోంది. దీని వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు సెలవు దినం రోజున ఒత్తిడి లేకుండా ఫలితాలు చూసుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రిజల్ట్స్ ఆధారంగానే విద్యార్థులు ఎంసెట్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతో పాటు ఉన్నత చదువులకు సిద్ధం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫలితాల అనంతరం మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు రీ-కౌంటింగ్ , రీ-వెరిఫికేషన్ ప్రక్రియలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఉత్తిర్ణత సాధించని విద్యార్థుల కోసం త్వరలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా బోర్డు ప్రకటించనుంది.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో మైనర్ బాలికకు వేధింపులు.. మనస్థాపంతో ఆత్మహత్య
Follow Us