/rtv/media/media_files/2025/03/07/tEh3RPW1qhXDYXwO9XVi.jpg)
RTC DA hike Photograph: (RTC DA hike)
RTC Workers: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డిఏ ప్రకటిస్తున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలు నుంచి ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా అందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పథకం వల్ల దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగినా.. వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. 2.5 శాతం డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని.. అయినా సరే ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Also Read: TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి వివిధ పథకాలు ప్రకటించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ఓప్పందం చేసుకోనున్నారు. శనివారం మొదటి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు ప్రారంభం కానుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మహిళా సంఘాలను ఎంపిక చేశారు.
Also Read: Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల!
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!