/rtv/media/media_files/2026/04/24/cv-anand-to-take-charge-as-dgp-in-telangana-2026-04-24-20-36-50.jpg)
CV Anand to Take Charge as DGP in telangana
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియామకం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీవీ ఆనంద్‌ను నియమించాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. మే మొదటి వారంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వంలో విలీనానికి గ్రీన్‌సిగ్నల్ ?
ప్రస్తుతం సీవీ ఆనంద్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే క్రమంలో.. ప్రభుత్వం ఆ స్థానంలో శిఖా గోయల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయనకు సమర్థవంతంగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే త్వరలో ఆయన డీజీపీ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
Also Read: నర్సంపేటలో హైటెన్షన్.. రోడ్డుపైనే శంకర్ గౌడ్ మృతదేహం
Follow Us