/rtv/media/media_files/2026/02/13/fotojet-3-2026-02-13-15-50-07.jpg)
Congress Victory in Ramagundam Corporation
BIG BREAKING : మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లలోనూ దూసుకుపోతుంది. మొత్తం 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా రామగుండం కార్పొరేషన్ తో కాంగ్రెస్ బోణి కొట్టింది. ఇక్కడ మొత్తం డివిజన్లు 60 ఉండగా కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించి విక్టరీ నమోదు చేసుకుంది. కాగా రామగుండం కార్పొరేషన్ లో బీఆర్ఎస్ 13 స్థానాల్లో, ఫార్వర్డ్ బ్లాక్ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి. కాగా రామగుండం మేయర్ స్థానం కాంగ్రెస్ కు దక్కనుంది.
రామగుండంతో పాటు మంచిర్యాల, నల్గొండ కార్పొరేషన్లను సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాలలో 60 వార్డులకు గానూ 41 వార్డుల్లో కాంగ్రెస్, 8 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో బీజేపీ, 2 వార్డుల్లో ఇతరులు విజయం సాధించారు. ఈ ఓటమి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇక నల్గొండలో మొత్తం 48 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 26, బీఆర్‌ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు ఏడు వార్డుల్లో విజయం సాధించారు.
Follow Us