BRS Vs CNG: యాదాద్రి భువనగిరి జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. కుర్చీలు విరగొట్టి, అద్దాలు, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను పగటగొట్టారు. దీతో కాంగ్రెస్ నేతల దాడిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండిచించారు.
గుణపాఠం చెబుతామంటున్న కేటీఆర్
సీఎం రేవంత్ మాటలతో దాడి చేస్తుంటే.. కార్యకర్తలు భౌతికదాడులు చేస్తున్నారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పే ఇందిరమ్మ రాజ్యం? అంటూ దాడికికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి పోలీసులను కోరారు. ఇక ఇందిరమ్మ రాజ్యం పేరుతో తెలంగాణలో గుండారాజ్యం నడుస్తోందని, నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే గుణపాఠం చెప్తామని కేటీర్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Cricket: టీమ్ ఇండియాలో మొదలైన అంతర్గత విభేదాలు.. గంభీర్ వల్లే ఓటములు!
భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ దాడి
— greatandhra (@greatandhranews) January 11, 2025
పూర్తిగా ధ్వంసమైన ఆఫీస్ ఫర్నిచర్... pic.twitter.com/raCGURDNeO
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే తగిన బుద్ధి చెబుతున్నామని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. వెంటనే రామకృష్ణారెడ్డి క్షమాపణలు చెప్పాలని, పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఘనల స్థలంలో కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: S S Rajamouli: హీరోలను వదలని రాజమౌళి శాపం.. 'గేమ్ ఛేంజర్' తో మరోసారి ప్రూవ్