BIG BREAKING: కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి

ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా ఆయన కవిత రాజీనామాను ఆమోదించారు. కవిత స్థానంలో అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

New Update
Congress Leader Azharuddin to replace  Kavitha MLC post in telangana

Congress Leader Azharuddin to replace Kavitha MLC post in telangana

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కవిత రాజీనామాను ఆమోదించారు. 2021 నిజామాబాద్‌ స్థానిక సంస్థల స్థానం నుంచి కవిత ఎమ్మె్ల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీతో కవితకు విభేదాలు రావడంతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆమెను సస్పెండ్ చేశారు. దీంతో గతేడాది సెప్టెంబర్ 3న ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసింది. ఎట్టకేలకు మండలి ఛైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదించారు. అయితే కవిత స్థానం నుంచి మంత్రి  అజారుద్దీన్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ట్రంప్ మన ప్రధాని మోదీని కిడ్నాప్ చేస్తే.. కాంగ్రెస్ లీడర్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సభలో సభ్యుడు కాని అజారుద్దీన్‌కు గవర్నర్‌ కోటాలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లోగా సభకు ఎంపీక కావాల్సి ఉంటుంది. ఇందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి గవర్నర్‌ నుంచి ప్రత్యేక ఆమోదం పొందడం రెండోది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడం. ఇప్పుడు కవిత రాజీనామా ఆమోదంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఖాళీ అయ్యింది. ఈ స్థానం నుంచే ఆయన్ని కాంగ్రెస్‌ బరిలోకి దింపాలని భావిస్తోంది. 

Also Read: భర్తకు 2 కోట్ల ఇన్సూరెన్స్‌..లేపేసి గుండెపోటు కథ..లవర్‌తో ఎంజాయ్‌ చేద్దామనుకుంటే...

#telugu-news #rtv-news #kavita #telangana
Advertisment
తాజా కథనాలు