Telangana: జిల్లాల హద్దుల మార్పులు అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

New Update
CM Revanth

CM Revanth

సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2029 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల హద్దులు మార్చొద్దని చెప్పిందన్నారు. కేంద్రం ఆంక్షలు ఎత్తివేయగానే ప్రజల కోరిక మేరకు హద్దులు మారుస్తామని స్పష్టం చేశారు. మరోవైపు గత ప్రభుత్వం తుమ్మడిహట్టి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఆదిలాబాద్‌కు అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించి జిల్లాకు గోదావరి నీళ్లు అందిస్తుందని తెలిపారు. 

Also Read: ఆ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే.. ఎక్కడో తెలుసా ?

అలాగే ఆదిలాబాద్‌లో త్వరలోనే ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ జిల్లాను పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలో ఈ జిల్లాకు యూనివర్సిటీ కూడా మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి తీరంలో ఉన్నటువంటి గుడిలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

Also Read: దేశంలో UGC, వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

 ఆదిలాబాద్ జిల్లా ప్రజలు నిరంకుశత్వం మీద పోరాడిన వీరులంటూ ప్రశంసించారు. కొమురం భీం లాంటి ఆదివాసీ వీరులు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారంటూ తెలిపారు. కానీ ఈ జిల్లాకు ఆధునిక విద్య, వైద్య సదుపాయాలు రాలేవన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నో ఒత్తిళ్లు, బెదిరింపులు తట్టుకొని పోరాడారని అన్నారు. విపక్ష ఎమ్మెల్యేలను తమ ప్రభుత్వం శత్రువులుగా చూడదని తెలిపారు. గత ప్రభుత్వంలో సీఎం వస్తుంటే విపక్ష నేతలను అరెస్టులు, గృహనిర్బంధాలు చేసేవారంటూ విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు సైతం నిధులు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి పనుల కార్యక్రమానికి విపక్ష ఎమ్మెల్యేను కూడా ఆహ్వానించామన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కేవం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని శత్రువులు కాదంటూ స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు