Telangana: మార్చి 12న వాళ్లకి సీఎం రేవంత్‌ చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు

తెలంగాణలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన వాళ్లకి సీఎం రేవంత్ మార్చి 12న నియామక పత్రాలు అందజేయనున్నారు. జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు 1292, పాలిటెక్నిక్ లెక్టరర్‌ పోస్టులకు 240 మంది ఎంపికయ్యారు.

New Update
CM Revanth

CM Revanth

తెలంగాణలో జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులకు ఎంపికైన వాళ్లకి సీఎం రేవంత్ మార్చి 12న నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతీలో సీఎం చేతుల మీదుగా ఎంపికైన వారు నియామక పత్రాలు అందుకోనున్నారు. జూనియర్ లెక్చరర్ల ఉద్యోగాలకు 1292 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అలాగే పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు 240 మందిని ఎంపిక చేసింది.

Also Read: సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్‌ బాబుపై సంచలన ఫిర్యాదు

అయితే కొత్తగా ఎంపికైన జూనియర్, పాలిటెక్నిక్‌ లెక్చరర్లకు విద్యాశాఖ విధానాలు, బోధన పద్ధతులపై శిక్షణ ఇచ్చి కళాశాలల్లో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. దీనివల్ల కొత్త లెక్చరర్ల నియామకాలతో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా టీజీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్‌-2 ఫలితాలను కూడా విడుదల సంగతి తెలిసిందే. 

Also Read: పాక్‌లో ట్రైన్‌ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్‌ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?

తెలంగాణ (Telangana) లో 563 పోస్టుల భర్తీకి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్1 మెయిన్ ఎగ్జామ్స్ ను  నిర్వహించారు. ఈ పరీక్షలకు 31 వేల 403 మందిని ఎంపిక చేస్తే ఇందులో 21 వేల 93 మంది హాజరయ్యారు. ఇక 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్‌ 16,17 తేదీల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 368 కేంద్రాల్లో ఈ రాత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ కేవలం 46 శాతం మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మరోవైపు గ్రూప్‌-3 ఫలితాలు కూడా విడుదల కానున్నాయి.    

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు