కేసీఆర్‌ వెయ్యేళ్లకు సరిపడా సంపాదించారు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఫైర్

గత ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చిందని సీఎం రేవంత్ విమర్శించారు. వాళ్లు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేసి, వెయ్యేళ్లకు సరిపడా సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
CM REVANTH3

రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రైతు భరోసాపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. '' రైతులను ఆదుకునేందుకు మా ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. దీనివల్ల రూ.22,600 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూర్చారు. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకు కూడా  ఈ ప్రయోజనం అందించారు. జమీందార్లు, భూస్వాములకు రైతు బంధు ఇవ్వాలా ?. మీరు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని కూడా రాళ్లకు, గుట్టలకు రైతుబంధు ఇవ్వాలంటున్నారు. 

Also Read: హైదరాబాద్ RTC బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్..కొత్త ఏడాది నుంచే ..!

 రైతు భరోసా అమలు చేసేందుకు సభ్యులందరూ సలహాలు ఇవ్వాలి. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగకూడదు. రైతుల ఆత్మహత్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉంది. బీఆర్‌ఎస్‌ పాలనలోనే 3 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించామని అబద్ధాలు చెప్పారు. కేసీఆర్ పదేళ్లు కష్టపడి కాళేశ్వరం కట్టారు. తీరా చూస్తే కొత్తగా కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు.

 విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా చేయలేదు. ప్రాజెక్టులు, టిమ్స్‌, నిమ్స్ ఆస్పత్రుల కాంట్రాక్టర్లకు సైతం బకాయిలు పెట్టారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.7 లక్షల కోట్లు అప్పులు చేశారు. మేము ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామని అంటున్నారు. ఆ పాపం బీఆర్‌ఎస్‌దే. అప్పులు లేకపోతే రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేవాళ్లం. ఈ పాపల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్‌ సిటీ, ఇంకా హైదరాబాద్‌లోని భూములు ఇలా అన్నీ అమ్మేశారు. చివరికి వైన్ షాపులను కూడా మిగల్చలేదు. 

Also Read: రైతులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. మంత్రి కీలక ప్రకటన!

వీళ్లు చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ రూ.100 కోట్లు ఇచ్చారు. విపక్షం చేసిన నానాయాగీ వల్ల ఆ మొత్తాన్ని మళ్లీ అదానీకే ఇచ్చేశాం. రూ.100 కోట్లు తిరిగి ఇవ్వడం వల్ల రాష్ట్రానికే నష్టం జరిగిగింది. కేసీఆర్‌ రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యి వందేళ్ల విధ్వంసం చేశారు. వెయ్యేళ్లకు సరిపడా సంపాదించారని'' సీఎం రేవంత్‌ విమర్శలు చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు