/rtv/media/media_files/2025/03/21/hOadt8Vg5V14QxIgtLCB.jpg)
CM Revanth
ఇటీవల గ్రూప్ 1, 2, 3 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఎప్పుడు ఉంటుందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా సీఎం రేవంత్ స్పందించారు. మరో 30 నుంచి 40 రోజుల్లో గ్రూప్ 1, 2,3లలో 2 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య, కొత్త నియామకాలకు సంబంధించి 922 మందికి పత్రాలు అందించారు.
Also Read: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో బిల్డ్‌నౌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. వాళ్లు రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రతినెలా రూ.10 వేల కోట్ల చొప్పున అసలు, మిత్తి కింద ఇప్పటిదాకా రూ.1.53 లక్షల కోట్లు చెల్లించాం. కాళేశ్వరం నిర్మాణం కోసం 11 శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చారు. దాన్ని 4-5 శాతం తగ్గించేందుకు యత్నిస్తున్నాం.
Also Read: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
మేము అధికారంలోకి వచ్చాక అప్పులకు చెల్లించిన రూ.1.53 లక్షల కోట్లు తమ చేతిలో ఉంటే 75 లక్షల మందికి రుణమాఫీ చేసేవాళ్లం. ఇతర సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్లం. రిటైర్ అయ్యిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.8 వేల కోట్లను బీఆర్‌ఎస్ పెండింగ్‌లో పెట్టింది. అందుకే వాటిని చెల్లించడం సమస్యగా మారింది. అతికష్టం మీద ప్రతినెలా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు చెల్లిస్తున్నామని'' సీఎం రేవంత్ అన్నారు.
Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!
Also read: ఆపరేషన్ హిడ్మా.. 125కు పైగా గ్రామాలను చుట్టుముట్టిన బలగాలు.. అడవిలో హైటెన్షన్!