![cm revanth reddy](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/10/LqIy62qABNcfxSss1eGT.jpeg)
cm revanth reddy
తెలంగాణలో ఇసుక రవాణా, తవ్వకాల అంశంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఫ్రీగా ఇసుకను సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుల లభించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. సోమవారం గనుల ఖనిజాభివృద్ధిపై ఆయన సమీక్ష సమావేశం జరిపారు.
Also Read: బీఈడీ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఒక ఏడాదే కోర్సు
ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలను దిశానిర్దేశం చేశారు. '' రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి. పేద ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాలి. ఇసుక మాఫియాపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇసుక రీచ్‌ల వద్ద అధికారులు తనిఖీ చేపట్టాలి. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ఎంతటి వాళ్లనైనా విడిచిపెట్టేది లేదు. ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించాలి.
Also Read: మతిపోగొడుతున్న ఏయిర్ షో.. అత్యాధునిక యుద్ధ విమానాల ప్రదర్శన
ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూసే బాధ్యతను జిల్లా కలెక్టర్లు.. ఎస్పీలకు ఇవ్వాలి. అలాగే హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించే బాధ్యత హైడ్రాకు అప్పజెప్పాలి. అన్నీ ఇసుక రీచ్‌ల వద్ద కెమెరాలు, సోలార్ లైట్లను ఏర్పాటు చేయాలి. ఇసక స్టాక్ యార్డుల వద్ద కూడా కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌ను వేయాలి. వినియోగదారుడు ఇసుకను బుక్ చేసిన 48 గంటల్లోనే అతడికి ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని'' సీఎం రేవంత్ ఆదేశించారు. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో సొంత స్థలాలు ఉన్నవాళ్లకి ఇళ్ల నిర్మాణం కోసం మొదటి విడుతలో ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తోంది.
Also Read: షాకింగ్ న్యూస్.. డ్రగ్స్ పెంచి పోషించిన ప్రధాని.. 50 వేల మంది మృతి!