/rtv/media/media_files/2025/01/26/aOxI93ADcBIIlfy3EL2r.jpg)
cm revanth key announcement Photograph: (cm revanth key announcement )
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. అన్ని రెగ్యూలర్ కాలేజీల మాదిరిగానే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని సీఎం ప్రకటించారు. డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, డిజిటల్ రిసోర్స్ సెంటర్, సెంట్రల్ ఇన్స్ట్ర్‌మెంటేషన్, ఎసెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయని.. ఇదేం ప్రభుత్వానికి పెద్ద భారం కాదన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్ శాంతికుమారిని సీఎం ఆదేశించారు.
Also Read : రాష్ట్రంలో పెరిగిన చికెన్ ధర.. ఇవాళ కిలో ఎంతంటే?
ఇక వర్సిటీలో ఉన్న ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని వీసీలను సీఎం ఆదేశించారు. తాను సీఎం కాగానే కేబినెట్ ఎంపికకు ఎంత ప్రాధాన్యత ఇచ్చానో అలాగే వీసీల నియామకానికి అంతే ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. యుజీసీ నిబంధనల పేరుతో వీసీల నియామాకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. యూజీసీని అడ్డం పెట్టుకొని చేసే కుట్రలు రాజ్యాంగంపై దాడిగా చూస్తామన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పదేళ్ల పాటు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. పదేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించే ఓపిక తనకు ఉందన్నారు సీఎం.
Also Read : దండోరా ఉద్యమం నుంచి ఎస్సీ వర్గీకరణ వరకు.. మందకృష్ణ పోరాట ప్రస్థానం ఇదే!
ఇవాళ 4 కొత్త పథకాలు
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కొత్తగా నాలుగు కొత్త పథకాలను ప్రారంభించనుంది. రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తొలుత 621 గ్రామాల్లోనే అమలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు అర్హులందరికీ లబ్ధి చేకూర్చనుంది. నారాయణపేట జిల్లా చంద్రవంచలో జరిగే పథకాల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో లబ్ధిదారుల అకౌంట్లలో నగదు సోమవారం జమ కానుంది.
తెలంగాణకు అవమానం
పద్మ పురస్కారాల్లో (Padma Awards 2025) తెలంగాణకు అవమానం జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్దారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని సీఎం అన్నారు. తెలంగాణకు పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : మేడ్చల్ మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్
Also Read : పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష-సీఎం రేవంత్ రెడ్డి