/rtv/media/media_files/2025/03/30/4kcXhvPYDx2c5B0xwGyk.jpg)
CM Revanth launches fine rice distribution scheme
తెలంగాణవ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో వీళ్లు పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభవుతుందని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. అలాగే దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని తెలిపారు.
Also Read: హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్తత.. అసలేంటీ వివాదం ?
ఇదిలాఉండగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కూడా సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ప్రజలు నివసించే నగరం కాదు.. పెట్టుబడుల నగరమని అన్నారు. లక్షలాది మందికి ఉపాధి అందించేలా దీని నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
Also Read: ''నెక్ట్స్ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్ చేసి బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్
ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారన్నారు. 2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read: మయన్మార్ మళ్లీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు
Also Read: మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!
telugu-news | rtv-news | telangana-news