Telangana: ఫ్యూచర్‌ సిటీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

New Update
CM Revanth

CM Revanth

రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఫ్యూచర్ సిటీ వల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక విషయాలు పంచుకున్నారు. '' రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నాం. హైదరాబాద్‌కు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాం. 

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ షడ్రుచుల కలయికలా ఉంది. రాష్ట్రంలో ఆదాయన్ని పెంచి ప్రజలకు పంచాలనేదే మా ప్రభుత్వ ఆలోచన. బడ్జెట్‌లో ఎక్కువగా నిధులు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకే కేటాయించాం. పెట్టుబడులు రావాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలి. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా మారుస్తాం. మూసీ నదిని ప్రక్షాళన చేయడం, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ప్రజలు నివసించే నగరం కాదు.. పెట్టుబడుల నగరం కూడా.  లక్షలాది మందికి ఉపాధి అందించేలా దీని నిర్మాణం జరుగుతుంది.  

Also Read: ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు...కోట్లల్లో దందా..

అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవు. ఏ విధానానికి 100కు 100 శాతం ఆమోదం లభించదు. ధనవంతుల లాగే పేదవారు సన్నబియ్యం తినాలని కోరుతున్నారు. 2024లో 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించేశాం. దేశంలో ఎక్కువగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత భారీగా వరి ఉత్పత్తి జరగలేదు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా అందిస్తున్నామని'' సీఎం రేవంత్ అన్నారు.

Also Read: కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...

Also Read: మయన్మార్‌ మళ్లీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు

 rtv-news | telangana

Advertisment
Advertisment
Advertisment