BIG BREAKING: ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
లోక్‌సభలో శుక్రవారం కేంద్ర ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందని అన్నారు.
లోక్‌సభలో శుక్రవారం కేంద్ర ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిపోయిందని అన్నారు. దక్షిణ భారత్‌కు జరిగే అన్యాయాన్ని అడ్డుకున్నామని చెప్పారు. ఇది రాజకీయ ఓటమి కాదని.. బీజేపీ విధానాలకు జరిగిన ఓటమని తెలిపారు. మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్‌ను అమలుచేసేందుకు కుట్రకు పాల్పడ్డారంటూ విమర్శించారు. రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్ర జరిగిందని.. బీజేపీకి 400 సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేవారని ఆరోపించారు. చిన్న సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని సీఎం రేవంత్ అన్నారు.
2023 మహిళా బిల్లును అమలు చేయాలని సూచించారు. దీనికి ఇండియా కూటమి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోపు మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అలాగే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దని తెలిపారు. రాజకీయ అధికారం మీ వద్ద ఉన్నా..ఆర్థిక వనరులు మాత్రం మానుంచే అందుతున్నాయని వ్యాఖ్యానించారు.

CM Revanth