CM Revanth: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆ స్కూళ్లపై రేవంత్ కీలక ఆదేశం

యంగ్ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం వెంటనే స్థలాలు గుర్తించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
cm revanth congress

cm revanth congress

యంగ్ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలల కోసం రేవంత్ సర్కార్‌ ముందడుగులు వేస్తోంది. సూళ్ల నిర్మాణం కోసం వెంటనే స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో పాఠశాలలు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల స్థలాల సేకరణ గురించి అధికారులను ఆరా తీశారు. 

Also Read: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్‌ఛార్జ్ ఎవరంటే?

గడువు ముగిసేలోగా.. పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు. స్థలాలు కేటాయిస్తే పాఠశాలలకు పర్మిషన్లు ఇచ్చే పనులు వేగవంతం చేయాలి. స్కూళ్లకు స్థలాలు అనువుగా ఉన్నాయే ? లేవో ? అనేవి పరిశీలించాలి. అనువుగా లేని ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలి. జిల్లా కలెక్టర్లు వెంటనే స్థలాలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై వారం రోజుల్లోగా ఓ రిపోర్టును ఇవ్వాలి.

Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్

105 నియోజకవర్గాల్లో రెండేళ్లలోనే పనులు మొత్తం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. అలాగే చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో సరైన వసతులు కల్పించాలి. అన్ని ఏర్పాట్లు చేయాలి. వర్సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని'' సీఎం రేవంత్ అన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు హైదరాబాద్‌లోని యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీని కూడా రేవంత్ సర్కార్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: వెళ్లిపో అంటే వెళ్లిపోతా.. బీజేపీలో వేధింపులు భరించలేకపోతున్నా : ఎమ్మెల్యే రాజాసింగ్‌  సంచలన కామెంట్స్

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Wine Shops Closed: మందుబాబులకు షాకింగ్​ న్యూస్.. వైన్​షాపులు, కల్లు దుకాణాలు బంద్- ఎప్పుడంటే!

మందు బాబులకు బ్యాడ్​ న్యూస్. హైదరాబాద్​లో వైన్​షాపులు, కళ్లు దుకాణాలు, బార్‌లు బంద్ కానున్నాయి.​ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12 ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని షాపులు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

New Update
Wine Shops

wine shops closed in hyderabad

మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మరొక్క రోజు ఆగితే.. మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి. ఒక్క మద్యం షాపులు మాత్రమే కాకుండా.. కళ్లు దుకాణాలు కూడా మూసేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా నగర కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

Wine Shops Closed in Hyderabad

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

హనుమాన్ జయంతి రోజున హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు అన్నీ క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 12 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కల్లు షాప్‌లు, బార్‌లు కూడా మూసివేయాలని తెలిపారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

ఈ ఆదేశాలు జంటనగరాల్లో అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కావున ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా హనుమాన్ జయంతి ఉత్సవాన్ని ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా వైన్​షాపులను మూసేసిన విషయం తెలిసిందే. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

(wine-shops-closed | wine-shops-closed-in-telangana | wine-shops | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment