KTR, CM Revanth : ఒకే వేదికను పంచుకోబోతున్న సీఎం రేవంత్, కేటీఆర్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ధ శత్రువులు. విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రాజకీయ వైరుధ్యం. ఆ ఇద్దరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ నేత కేటీఆర్. కానీ ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు

author-image
By Madhukar Vydhyula
New Update
ktr vs revanth reddy

KTR vs Revanth Reddy

KTR, CM Revanth:  తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ధ శత్రువులు. విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు ఇలా ఇద్దరి మధ్య ప్రతిరోజు ఏదో ఒక వాదన. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత రాజకీయ వైరుధ్యం. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన ఆ ఇద్దరే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ ఆసక్తికరంగా ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. అది కూడా ఒకే అంశానికి మద్దతు ఇస్తూ…రాజకీయంగా భిన్న దృవాలుగా ఉన్న రేవంత్, కేటీఆర్.. ఒక అంశంలో ఒకే వాయిస్ వినిపించబోతున్నారు. ఈ సమావేశానికి చెన్నై వేదిక కాబోతోంది. డీ లిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం కల్గుతుందనే టాక్ వస్తోంది. ఈ విషయంలో బీజేపీతో పోరాటం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. చెన్నైలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి బీజేపీ వ్యతిరేక పార్టీలను ఆహ్వానించారు. స్టాలిన్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ వెళుతున్నారు. ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకోనుండటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

శనివారం(మార్చి 22) జరగబోయే సౌత్ ఇండియా జేఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు హాజరవుతారు. పార్లమెంట్ నియోజకవర్గల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మాజీ మంత్రి కేటీఆర్‌ను కూడా ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతలు శుక్రవారం సాయంత్రం బయలుదేరి చెన్నై చేరుకుంటారు. అక్కడ జరిగే సౌత్ ఇండియా జేఏసీ సమావేశంలో ఒకే వేదికపై ఇద్దరు కూర్చుంటారు. అదే వేదికపై షేక్ అండ్ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది.

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కేటీఆర్, రేవంత్ రెడ్డి గళం విప్పనున్నారు. ఒకే అంశానికి మద్దతిస్తూ ఈ ఇద్దరు నేతలు మాట్లాడుతున్న ఒక వేదిక ఇప్పటివరకు ఇదే మొదటిది. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. సౌత్ ఇండియా జేఏసీ స్టేజ్‌పై చెన్నైలో ఇద్దరు పలకరించుకుంటారా..? షేక్ అండ్ ఇచ్చుకుంటారా..? ఇద్దరు ప్రసంగాల్లో ఒకరి పేరు ఒకరు తీసుకుంటారా? ఇలా చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.ఇప్పటివరకు వరకు కూడా ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుల మాటల యుద్ధం జరుగుతోంది. వ్యక్తిగతంగా కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పరిధి దాటి ఆరోపణలు… కుటుంబాలపై కూడా బురద జల్లడాలు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు రాజకీయ శత్రువులు ఒకే వేదికపై షేక్ అండ్ ఇచ్చుకుంటే, నవ్వుతూ పలకరించుకుంటే.. ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment