BREAKING: దానం నాగేందర్‌కు మంత్రి పదవి.. సీఎం రేవంత్ సంచలన వ్యూహం ఇదే!

ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కేబినెట్‌లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జీఎచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా నుంచి దానంకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ టూర్‌లో హై కమాండ్‌తో చర్చించనున్నారట.

New Update
Danam Nagender: ఎమ్మెల్యే దానంకు షాక్.. హైకోర్టు నోటీసులు

CM Revant and Danam Nagender

Breaking: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కేబినెట్‌లోకి తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జీఎచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా నుంచి దానంకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ టూర్‌లో దానం మంత్రి పదవిపై హై కమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. 

కాపు సామాజిక వర్గం ప్లస్ పాయింట్.. 

ఈ మేరకు మరికొన్ని రోజుల్లో GHMC ఎన్నికలు రానున్న నేపథ్యంలో దానంకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట.  హైదరాబాద్‌పై ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. కాగా దానంను కేబినెట్ లోకి తీసుకుంటే బీఆర్ఎస్‌కు ధీటుగా సమాధానం ఇస్తారని  ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దానం కాపు సామాజిక వర్గం కావడంతో అదికూడా పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. దీంతో దానం నాగేందర్‌ను ప్రొత్సహించాలని చూస్తున్న సీఎం రేవంత్ ఢిల్లీ టూర్‌లో అతనికి మంత్రి పదవి వచ్చేలా హై కమాండ్‌తో చర్చించనున్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: Death: చనిపోయాడనుకున్నారు.. మార్చురీకి తీసుకెళ్లేసరికి ఊహించని షాక్

పది మంది జంప్ అవుతారంటూ..

మరోవైపు ఇటీవల దానం నెమ్మదిగా స్వరం మార్చడం కాంగ్రెస్ లో ప్రకంపనలు రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన దానం.. ఇటీవల కేసీఆర్, కేటీఆర్ ను పొగడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు రేస్ వల్ల హైదరాబాద్ కు మంచి పేరు వచ్చిందని దానం చెప్పడం చర్చనీయాంశమైంది. దీంతో పార్టీ మారబోతున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మరో 9మంది ఎమ్మెల్యపై కూడా సీఎం రేవంత్ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. పదిమంది బీఆర్ఎస్ లోకి  జంప్ అవుతున్నారనే ఊహగానాలతో కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ పదిమందిలో కీలక నేత దానంను ఎలాగైనా కాపాడుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. 

ఇది కూడా చదవండి: Mutton free: ఇంటింటికీ ఫ్రీగా మటన్.. కనుమ సందర్భంగా బంపర్ ఆఫర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు