TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్ ఛార్జీలు తగ్గింపు

హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్చీలు తగ్గించింది. టికెట్‌ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్‌ పేరుతో తగ్గించింది.

New Update
TGSRTC

TGSRTC

హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ ఏసీ బస్సు ఛార్చీలు తగ్గించింది. టికెట్‌ ధరల్లో మార్పులు చేయనప్పటికీ డిస్కౌంట్‌ పేరుతో తగ్గించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉండే ఛార్జీలతో సమానం చేసింది. 3 నెలల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఛార్జీల తగ్గించడం వల్ల ఈ 3 నెలల పాటు బస్సులకు ఆదరణ వస్తే ఇవే చార్జీలు కొనసాగిస్తారు. ఈ కేటగిరీ బస్సుల సంఖ్యను కూడా పెంచాలని ఆర్టీసి నిర్ణయించింది.      

Also Read: మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డికి షాక్.. అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌?

ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా RTC ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఫ్రిగా ప్రయాణించే వీలుంది. ఈ వెసులుబాటు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు కేటగిరి బస్సుల్లో రద్దీ పెరిగింది. ఇతర కేటగిరి బస్సుల్లో వెళ్లే చాలామంది మహిళలు, ఆటో, క్యాబ్‌లలో వెళ్లే వాళ్లు కూడా బస్సుల్లోనే వెళ్తున్నారు. దీనివల్ల ఆ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (OR) వంద శాతం దాటింది. కానీ పురుషులకు మాత్రం పరిమితంగానే సీట్లు ఉంటున్నాయి. 

Also Read: కేంద్రం వలస కూలీలకు వరం.. ఫ్రీగా LPG గ్యాస్ సిలిండర్లు పంపిణీ!

ఇప్పటికే పురుష ప్రయాణికుల నుంచి దీనిపై చాలా ఫిర్యాదులొచ్చాయి. ఈ క్రమంలోనే మెట్రో డీలక్స్ పేరుతో ఆర్టీసీ కొత్త కేటగిరీ సర్వీసును ప్రారంభించింది. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో పురుష ప్రయాణికులకు సీట్లు దొరుకుతున్నాయి. కానీ ఈ డీలక్స్ బస్సుల్లో టికెట్ ధర కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో ఆశించిన స్థాయిలో OR రికార్డు కాలేదు. అందుకే ఈ బస్సుల టికెట్ ధరలు తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందుకే ఈ బస్సుల్లో డిస్కౌంట్‌ను ప్రకటించింది. 

Advertisment
తాజా కథనాలు