Crime: తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఉన్న ఓ మహిళా హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది.

New Update
Death

Death

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో చిక్కుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. గౌలిదొడ్డిలో ఉన్న ఓ మహిళా హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన చిన్నారనికి పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిస్తు ఘోష్‌గా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులు మహిళా హాస్టల్‌లో వంట మనుషులుగా జీవనోపాధి పొందుతున్నారు. 

Also Read: గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్.. ఇంట్లో ఉన్న మీ బంగారానికి వడ్డీ.. మోదీ సంచలన స్కీమ్!

ఈ దంపతులకు ఐదేళ్ల చిన్నారి బిస్తు ఘోష్‌ ఉంది. అయితే బుధవారం మధ్యాహ్నం ఆ చిన్నారి లిఫ్ట్‌లో అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 5వ ఫ్లోర్‌కు వెళ్లింది. ఇలా వెళ్తున్న క్రమంలోనే 3వ ఫ్లోర్‌లోనే ఆ బాలిక జుట్టు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె తల మొత్తం నుజ్జునుజ్జుయి కావడంతో బిస్తు ఘోష్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

Also read: సిట్ నోటీసులపై స్పందించిన బండి భగీరథ్..

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. హైడ్రా, ఫైర్‌ సిబ్బంది సాయంతో ఆ చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు విచారణ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు