Telangana: రేవంత్‌ సర్కార్‌కు కేంద్రం షాక్.. ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై మరో సారిసర్వే చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. కేంద్రం రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేస్తేనే నిధులిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. కేంద్రం ఈ నిర్ణయంతో ఇళ్ల పంపీణీపై సస్పెన్స్ నెలకొంది.

New Update
Indiramma House Scheme

Indiramma House Scheme Photograph: (Indiramma House Scheme)

తెలంగాణ సర్కార్‌కు కేంద్ర బిగ్ షాక్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై మరో సర్వే చేయాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రప్రభుత్వం రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేస్తేనే నిధులిస్తామని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. కేంద్రప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పంపీణీపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 23లక్షల మంది లబ్దిదారులను ఫైనల్ చేసింది. రాష్ట్రప్రభుత్వం ఫైనల్‌ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే చాలామంది ఇందిరమ్మ ఇళ్ల వస్తున్నాయని ఎన్నో ఆశలతో ఉన్నారు. కేంద్ర ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోందో చూడాలి మరి.

Also read: BRS Leaders: MLAపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ నాయకులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Harish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు హరీష్ రావు హాజ‌ర‌య్యారు.

New Update
HARISH RAO

Harish Rao

Harish Rao :  కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవు అన్నది ప్రజలకు అర్థమయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నెరవేర్చారా.? నో ఎల్ఆర్ఎస్ అని అన్నారు కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మేము వస్తే ఫార్మాసిటీ భూములన్ని రైతులకు వాపసిస్తామని అన్నారు. ఇప్పుడేమో 16 వేల ఎకరాలు ఫార్మా సిటీ కోసం స్వీకరిస్తామని ప్రకటించారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

కేసీఆర్‌ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిన మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయాలి అనేది. ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులకు నీళ్లు అందించాలని చెప్పేది. రేవంత్ రెడ్డి మాట్లాడితే పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా చంపుతా తొడలదర కొడతా ఇలాంటి భాష రేవంత్ రెడ్డిది. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఢిల్లీలో బిసి సభకు రాహుల్ గాంధీని తీసుకొని వస్తా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదింపజేస్తా అని అన్నాడు. వీళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి కూడా ధర్నాకు రాలేదు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మరుసటి రోజు రేవంత్ రెడ్డి లేకుండా పిసిసి అధ్యక్షులతో ఉపముఖ్యమంత్రితో ఫోటోలు దిగారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క మొన్న ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. హెచ్‌సీయూ విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తున్నామని ప్రకటించారు. ఈ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశించిందట ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటారంట. ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి కేసులు పెడితే ఉపముఖ్యమంత్రి కేసులు ఉపసంహరించుకుంటాడు అంట. ఇదేమి రాజ్యం. తోక కుక్క నాడిస్తున్నదా కుక్క తోక నాడిస్తున్నదా అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని ఉపముఖ్యమంత్రి బట్టి భట్టి విక్రమార్క చెప్పినట్టే కదా..? హెచ్‌సీయూ విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారు అని విడుదల చేసినట్టే కదా..? అక్రమ కేసులో పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్‌సీయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment