BJP: మహారాష్ట్ర సీఎం ఎవరో తేలిది ఈరోజే !.. ఆయన పేరే ఖరారు

మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడే ఛాన్స్ ఉంది. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. సీఎంగా పఢ్నవీస్ పేరు ఖరారైందని ఓ బీజేపీ నేత వెల్లడించారు.

New Update
MAHA CM 2

మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఇంకా తెర వీడలేదు. అయితే డిసెంబర్ 5న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. సోమవారం మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది తేలిపోయే అవకాశం ఉంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీఎం పదవి అంశంలో అలిగి సొంతూరు వెళ్లిన షిండే.. తిరిగి ముంబయికి వచ్చారు. బీజేపీకి సీఎం అభ్యర్థికి తాను మద్దతిస్తామని పేర్కొన్నారు.  

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

BJP Likely To Declare Maharashtra CM Today

ముంబయిలో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు జరగనున్న బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకునే ఛాన్స్ ఉందని ఓ సీనియర్ బీజేపీ నేత చెప్పారు. కానీ ఈ మీటింగ్ 3,4 తేదీలకు కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. మొత్తానికి సీఎం అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు ఖరారైందని మరో బీజేపీ నేత వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..

మరోవైపు మహారాష్ట్ర సీఎం ఎవరో ప్రజలందరికీ తెలుసని.. త్వరలోనే అధిష్ఠానం అధికారికంగా డిక్లేర్ చేయనుందని బీజేపీ నేత రావ్‌సాహెబ్‌ ధన్వే పేర్కొన్నారు. కేబినెట్‌పై కూడా కొత్త ముఖ్యమంత్రే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సీఎం అభ్యర్థిగా పుణె ఎంపీ, కేంద్ర సహాయమంత్రి మురళీధర్‌ పేరు కూడా వినిపించింది. అలాగే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉంటారని ఎన్సీపీ నేత అజిత్ పవార్ తెలిపారు. అలాగే ఇదే పార్టీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారని పేర్కొన్నారు.    

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

ఇదిలాఉండగా.. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 288స్థానాలకు గానూ 233 సీట్లు సాధించింది.  బీజేపీ 132 స్థానాలను గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. శిండే శివసేన 57, ఎన్సీపీ అజిత్ 41 పవార్ పార్టీలకు సీట్లు దక్కాయి. ఇక మహా వికాస్ అఘాడి కూటమికి 46 సీట్లు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు