/rtv/media/media_files/2025/03/10/nRwYkULjc9lAKTNyEgYb.jpg)
Eatela Rajender
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కుటుంబ సమేతంగా కలిశారు. ఈటల మనవడికి ప్రధాని స్వయంగా చాక్ లెట్స్ అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిందని.. అందుకే ప్రధానిని ఈటల కలిశారన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు : కేటీఆర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కుటుంబసమేతంగా కలిసిన ఈటల రాజేందర్ @Eatala_Rajender @narendramodi #LatestNews #RTV pic.twitter.com/3ijHOEdFJt
— RTV (@RTVnewsnetwork) March 10, 2025
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిని నియమించడం కోసం ఆ పార్టీ హైకమాండ్ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. అధ్యక్ష పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ తదితరులు పోటీ పడుతున్నారు. రఘునందన్, ఈటల అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈటల వైపై బీజేపీ నాయకత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బలమైన బీసీ నేత అయిన ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే కలిసివస్తుందని కమలనాథులు భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Addanki Dayakar: ఎట్టకేలకు దక్కిన ఫలితం.. MLC దక్కించుకున్న అద్దంకి ప్రస్థానమిదే!
హైకమాండ్ నుంచి ఈటలకు గుడ్ న్యూస్?
మరి కొన్ని రోజుల్లోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ఈ రోజు తన సతీమణి, పిల్లలతో కలిసి ప్రధానిని కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ నుంచి ఆయనకు సమాచారం అందిందని.. ఈ నేపథ్యంలోనే ప్రధానిని ఫ్యామిలీతో కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.