/rtv/media/media_files/2025/03/13/6iAgnBxc9eqkt3KpPYS4.jpg)
Bandi Sanjay Song
తెలంగాణ బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సింగర్ గా మారారు. తన అభిమాన నేత, ప్రధాని మోదీపై పాట పాడారు. ''నమో..నమో .. నరేంద్ర మోదీ.. పలుకుతున్నది యువత నాడి.. ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి..'' అంటూ ఆయన పాడిన పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బండి సంజయ్.. పాట పాడడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పాట ఇప్పటిది కాదని కొందరు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్నికల ముందు పాడిందని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఉదయం నుంచి ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నమో..నమో .. నరేంద్ర మో*
— SR🚩 (@SrGoud29) March 12, 2025
సింగర్ : బండి సంజయ్ 😇 pic.twitter.com/2GLzkp54N6