BIG BREAKING: మంత్రివర్గ విస్తరణలో బిగ్ ట్విస్ట్.. హైకమాండ్ కు జానారెడ్డి సంచలన లేఖ!

తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మళ్లిఖార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ పంపించారు.

New Update
 Kunduru Jana Reddy

Kunduru Jana Reddy

BIG BREAKING:  తెలంగాణ కేబినెట్ విస్తరణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మళ్లిఖార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు జానారెడ్డి లేఖ పంపించారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని జానారెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చూడండి: IPL 2025: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
 
తెలంగాణ కేబినెట్ విస్తరణపై గతకొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 3న ముహూర్తం ఖరారు చేసినట్లు పొలిటికల్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సహా.. 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే ఖాళీగా ఉన్న ఆరు పోస్టుల్లో ప్రస్తుతం నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ అదిష్ఠానం ఫిక్స్ అయినట్లు తెలిసింది.
 


ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు రాహుల్, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించారు. పదువుల భర్తీపై కీలక నిర్ణయం తీసకున్నట్లు తెలిసింది. రేసులో పలువురు సీనియర్లు ఉన్నా.. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేయాలని చెప్పినట్లు తెలిసింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, జానారెడ్డి కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఏఐసీసీ పెద్దలు మళ్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు లేఖ రాశారు. కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రెండు జిల్లాల నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రాంమోహన్ రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ప్రస్తుతం మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు.ఇక హైదరాబాద్ జిల్లా నుంచి ఒకరు కూడా ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జానా రెడ్డి లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. జానారెడ్డి ఎవరికి మద్దతుగా లేఖ రాశారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.

Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Kancha Gachibowli Lands : కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూముల వద్దకు ఎవరూ రావొద్దని సూచించింది.

New Update
Kancha Gachibowli Lands

Kancha Gachibowli Lands

 Kancha Gachibowli Lands :హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Also read; JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్

హైదరాబాద్ శివార్లలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతం చుట్టూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టకేలకు సీరియస్ అయింది. ప్రజల రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూముల వద్దకు ఎవరూ రావొద్దని సూచనలు చేసింది. బయటి వ్యక్తులపై నిషేధం విధించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం లేని వ్యక్తులను ఆ భూముల్లోకి ఎంటర్ కానివ్వొద్దని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి.. ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూములు అధికారుల పర్యవేక్షణలో ఉంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ భూములకు సంబంధించి న్యాయపరమైన వివాదం కోర్టుల్లో ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.  రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి రెవెన్యూ స‌ర్వే నం.25లో గల 400 ఎక‌రాల భూమిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోన్న విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అత్యవసరంగా చెట్లను నరికి వేయాల్సిన అవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీనివల్ల పర్యావరణం పాడవుతుందనీ, అక్కడ నివసించే జంతుజాలం నాశనమవుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!

#police #hcu lands auctions #hcu lands dispute #hcu lands issue #hcu campus land issue #hcu 400 acres issue #400 acres hcu land issue
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు