/rtv/media/media_files/2026/02/19/etela-2026-02-19-10-07-16.jpg)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి ఇప్పుడు ఢిల్లీకి పాకింది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటున్న తరుణంలోప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో బీజేపీ నేతలు కుమ్మక్కు అయ్యారనే వార్తలు అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఎంపీలు ఈటల రాజేందర్(eatala-rajendar), రఘునందన్ రావు(mp raghunandan) వ్యవహారశైలిపై ప్రధాని మోడీతో సహా కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగి ఛైర్మన్ ఎంపిక సందర్భంగా ఇస్నాపూర్‌లో బీజేపీ(telangana-bjp) ఎంపీ రఘునందన్ రావు ఏకంగా బీఆర్ఎస్కు ఓటు వేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అటు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిధిలోని ఎల్లంపేటలో కూడా బీజేపీ, బీఆర్ఎస్కు మద్దతు పలికింది. అయితే ఈటల అక్కడ ఎక్స్అఫిషియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఓటు వేయకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా, బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీఆర్ఎస్లతో ఈ రహస్య పొత్తులేంటని ఢిల్లీ పెద్దలు మండిపడినట్లుగా తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ నితిన్ నబీన్ వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఫోన్ చేసి పూర్తి వివరాలు కోరారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా రాంచందర్‌రావును కలిసి ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి ఎవరెవరు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారో, ప్రత్యర్థులకు ఎలా సహకరించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా సమాచారం.
Also Read : తెలంగాణలో 2 రాజ్యసభ ఖాళీలు VH, జీవన్ రెడ్డితో పాటు పోటీలో ఉన్నది వీరే!
అపవిత్ర పొత్తులపై లిస్ట్ సిద్ధం
రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే జిల్లాల వారీగా ఈ అపవిత్ర పొత్తులపై లిస్ట్ సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన లీడర్లపై కేంద్ర బీజేపీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సొంత పార్టీ అభ్యర్థులను కాదని, ప్రత్యర్థులతో చేతులు కలిపిన కీలక నేతలకు ఈసారి అధిష్టానం గట్టి వార్నింగ్ ఇవ్వున్నట్లుగా తెలుస్తోంది.
ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. కరీంనగర్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడమే కాకుండా, తన బలాన్ని నిరూపించుకుంటూ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడ బీజేపీ మొత్తం 66 డివిజన్లలో 30 స్థానాలను గెలుచుకుంది. స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలలో బీజేపీ ఒక చైర్మన్ పదవిని, ఏడు వైస్-చైర్మన్ పదవులను దక్కించుకుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 21 వార్డులను గెలుచుకుని బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది.
Also Read : అమెరికా నుంచి వచ్చి మాజీ భార్యని హత్య.. సునీత మర్డర్ కేసులో సంచలన విషయాలు
Follow Us