/rtv/media/media_files/2025/04/14/6Khpb1ylCd0GJMyTimTf.jpg)
Malla Reddy
Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీస్‌కు ఇవ్వాల్సిన రూ.20లక్షలు ఇవ్వకుండా మోసం చేశారంటూ మర్రి రాజశేఖర్‌పై యేసుబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీస్ ద్వారా రాజశేఖర్ రెడ్డికి చెందిన అరుంధతి హాస్పిటల్‌కు 40మంది సిబ్బందిని కేటాయించేందుకు యేసుబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు.
Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాగా 40 మంది సిబ్బందికి గాను రూ.50లక్షలు ఇచ్చేందుకు అంగీకరించిన రాజశేఖర్ రెడ్డి. ఈ మేరకు యేసుబాబు 40 మంది సిబ్బందిని నియమించాడు.అయితే పలు ధపాలుగా రూ.30 లక్షలు చెల్లించిన రాజశేఖర్ రెడ్డి మిగిలిన రూ.20 లక్షల కోసం అడిగితే స్పందించడం లేదంటూ యేసుబాబు ఫిర్యాదు చేశాడు. ఎన్నిసార్లు డబ్బులు అడిగిన స్పందించకపోవడంతో డబ్బులు ఇవ్వడం లేదంటూ యేసుబాబు పోలీసులను ఆశ్రయించాడు.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
BNS చట్టం ప్రకారం చీటింగ్ కేసు
యేసుబాబు ఫిర్యాదు మేరకు రాజశేఖర్ రెడ్డిపై BNS చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. పోలీస్ స్టేషన్‌లో 316/2,318(4) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.కేసులో నేరం రుజువైతే 5ఏళ్లు శిక్ష విధించే అవకాశం ఉంటంటున్న పోలీసులు. కాగా గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
Also Read: VIRAL VIDEO: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్