/rtv/media/media_files/2025/01/18/IsU1nJRGrmUQlqFsA84f.jpg)
Bhatti vikramarka big announcement on Gaddar Cine Awards
TG News: గద్దర్ సినీ అవార్డులకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో కీలక ప్రకటన చేశారు. ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నాటక పోటీలు నిర్వహించి అవార్డులు..
ఈ మేరకు హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు హాజరైన భట్టి విక్రమార్క ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. గత పదేళ్లు పాలించిన ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదు. కానీ ప్రజా ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసమే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టాం. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇస్తామని చెప్పారు.
Also read : మేడిగడ్డలో లోపాలు.. ఆ బ్లాక్ మళ్లీ నిర్మించాల్సిందే .. ఎన్డీఎస్‌ఏ సంచలన రిపోర్ట్
భక్త రామదాసు 392వ జయంతి..
అలాగే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారని చెప్పారు. సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ.. సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం అన్నారు. ఈ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని, ఇందులో 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నట్లు తెలిపారు.
Also read : పిల్లలమ్మ, పిల్లలూ.. నార్త్ ఇండియన్ పిల్లలు.. ఏపీలో బలగం సరోజిని దందా గుట్టురట్టు