Sri Rama Navami:  ఇంటికే భద్రాచలం రామయ్య ముత్యాల తలంబ్రాలు.. ఎలానో తెలుసా?

దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలతో శ్రీరామనవమి ఒకటి. దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కొలువైన శ్రీరాముల వారి కళ్యాణం ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.  

New Update
FotoJet (12)

Sri Rama Navami

Sri Rama Navami: దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలతో శ్రీరామనవమి ఒకటి. దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కొలువైన శ్రీరాముల వారి కళ్యాణం ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.  ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున స్వామి  కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఈ వేడుకను తమ కళ్లారా వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి వస్తుంటారు. గోదావరి నది తీరాన జరిగే రాములవారి కళ్యాణ ఘట్టం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ఏడాది మార్చి 19న స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుండగా ఏప్రిల్ 2  ముగుస్తాయి. కాగా ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే భక్తులకు టికెట్ బుకింగ్ , రాలేని భక్తులకు ఇంటికే తలంబ్రాలను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

 కాగా బ్రహ్మోత్సవాలలో అతిముఖ్యమైన  శ్రీ సీతారాముల వారి వార్షిక కళ్యాణం మార్చి 27న జరగనుంది. ఆ మరునాడు  అంటే మార్చి 28న శ్రీరాముల వారి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.  ఆన్‌లైన్ సదుపాయం లేని వారు మార్చి 15 నుంచి భద్రాచలం రామాలయ ప్రధాన కౌంటర్, తానీషా కళ్యాణ మండపం, గోదావరి బ్రిడ్జీ వద్ద ఉన్న దేవస్థానం విచారణ విభాగం లేదా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం ద్వారా నేరుగా టికెట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది.

ఇక  భద్రాచలానికి రాలేని భక్తుల కోసం కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా రూ. 5,000 లేదా రూ. 1,116 టికెట్లు బుక్ చేసుకోవచ్చు,  తద్వారా వారి గోత్ర నామాలతో ఆలయంలో కళ్యాణం జరిపిస్తారు. అంతేకాకుండా, స్వామివారి ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు TGSRTC లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక సేవలను నిర్వహిస్తోంది.. రూ. 151 చెల్లించి సమీప ఆర్టీసీ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్ ద్వారా తలంబ్రాలను బుక్ చేసుకుంటే, ఉత్సవాల మగిసిన తర్వాత తలంబ్రాలు ఇంటికే డెలివరీ చేస్తారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లతో పాటు, 2 లక్షల చిన్న లడ్డూలు , 3 వేలకు పైగా మహా లడ్డూలను అధికారులు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలు (TGSRTC, APSRTC) వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడిపించనున్నాయి.  

Advertisment
తాజా కథనాలు