Tiger: శృంగార వేట.. తాడ్వాయి అడవుల్లో తిష్టవేసిన బెంగాల్‌ టైగర్‌!

గత రెండు నెలలుగా ఆడ తోడుకోసం ఆడవులన్నీ జల్లెడపడుతూ సంచరిస్తున్న పెద్దపులి మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మేటింగ్ కోసం ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి ములుగు తాడ్వాయి అడవుల్లో తిష్టవేసినట్లు అటవీశాఖ రేంజ్‌ అధికారి సత్తయ్య వెల్లడించారు. 

author-image
By srinivas
New Update
tiger

ఆడ తోడుకోసం తాడ్వాయి అడవుల్లో తిష్టవేసిన పెద్దపులి

Tiger: పెద్దపులి కామ వాంఛ తీరలేదు. ఆడ తోడు కోసం ఆడవులన్నీ జల్లెడ పడుతోంది. గత రెండు నెలలుగా వందల కిలోమీటర్ల తరబడి ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీష్‌గడ్ బార్డర్‌లో ఆడపులి జాడకోసం తిరుగుతున్న బెంగాల్ టైగర్.. కోరిక తీరని ఆవేశంతో ఎదురుపడిన జంతువులు, మనుషులపై దాడి చేస్తోంది. ఇటీవలే తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇద్దరిపై దాడిచేసిన పెద్దపులి జర్నీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు దాని జాడ కనిపెట్టారు. ఇటీవల తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న పులి.. అక్కడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి వచ్చి అక్కడే తిష్టవేసినట్లు అటవీశాఖ రేంజ్‌ అధికారి సత్తయ్య వెల్లడించారు. 

ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ నుంచి..

ఈ మేరకు తాడ్వాయి మండలం బందాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. గత వారం పంబాపురం, నర్సాపురం, బందాల అడవుల్లో జంతువులను వేటాడిన ఆనవాళ్లు లభించినట్లు బయటపెట్టారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇరవై రోజులకుపైగా అటవీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిందని, శృంగారం వేటలోభాగంగా ఆడతోడు కోసం అడవులన్నీ జల్లెడపడుతుందని చెప్పారు. ఆదిలాబాద్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం, ఇంద్రావతి మీదుగా కొత్తగూడెం మణుగూరు అటవీ ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చిన పాదముద్రలున్నట్లు తెలిపారు. 2021లో ఛత్తీస్‌గఢ్‌ ఇంద్రావతి టైగర్‌ రిజర్వ్‌ నుంచి మేటింగ్ కోసం ములుగు అడవులకు వచ్చిన పులే ఈసారి కూడా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Dil Raju: శ్రీతేజ్ తండ్రికి జాబ్.. నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన!

2021లోనూ ఇదే పులి..

ఇక గత నాలుగైదేళ్లుగా పులుల సంచారానికి సంబంధించిన కెమెరా ట్రాప్‌లను పరిశీలించిన తర్వాతే అది ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈ పులి ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయిల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు పులి కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. 2021లోనూ వరంగల్, ములుగు, తాడ్వాయి, మంగపేట, కరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment