కేసీఆర్‌కు BC సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ లేఖ రాశారు. BC అభ్యర్థులకు మద్దతు ఇచ్చి.. బీఆర్‌ఎస్‌కి వెనుకబడిన తరగతులపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలని జాజులపేర్కొన్నారు.

New Update
jajula srinivas goud

jajula srinivas goud Photograph: (jajula srinivas goud)

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. BRS పార్టీ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను ఆయన కోరారు. బీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి.. బీఆర్‌ఎస్ పార్టీకి వెనుకబడిన తరగతులపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Also Read : ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్!

బీసీ వాదంతో వస్తున్న కవిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఖరింటో స్పష్టం చేయాలని లేఖలో అడిగారు. బీసీలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోకుండా బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కృషి చేయాలని కేసీఆర్‌కు ఆయన సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు పూల రవీందర్, ప్రసన్న హరికృష్ణ, మల్కా కొమురయ్య లకు మద్దతు ఇచ్చి తమ చిత్తశుద్ధిని బిఆర్ఎస్, కవిత నిరూపించుకోవాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బిఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోతే.. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ కోల్పోతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.  గ్రాడ్యుయేట్ రెండు, ఉపాధ్యాయ రెండు మొత్తం తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ ఎన్నికల జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు.

Also Read: Champions Trophy: దుబాయ్ స్టేడియంలో చిరు, సుకుమార్, నారా లోకేశ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు