/rtv/media/media_files/2025/01/25/O8KgwciE6hn4A3ylpZNd.jpg)
Deputy CM Batti Vikramrka
తెలంగాణలో జనవరి 26 నుంచి నాలుగు కొత్త స్కీమ్స్ ప్రారంభించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రతీ మండలంలో కూడా ఓ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ నాలుగు స్కీమ్స్ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పతకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభలు నిర్వహించినట్లు గుర్తుచేశారు.
Also Read: కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు.. నల్లమల్లారెడ్డి 200 ఎకరాల్లో!
వీటికోసం ప్రజల నుంచి లక్షల్లో దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రేపటి నుంచే ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభిస్తామని.. వ్యసాయం చేయదగిన భూములకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. భూమిలేని నిరుపేద, ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు.
Also Read: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా?
మంత్రి ఉత్తమ్ కూమర్ రెడ్డి కూడా రేషన్ కార్డుల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అలాగే ఒక్కో వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి మూడు ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఆ పథకాల అమలు …అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం అందేలా కార్యచరణ పై అందుబాటులో ఉన్న మంత్రులు… ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈ రోజు… pic.twitter.com/YRPRlfY92D
— Revanth Reddy (@revanth_anumula) January 25, 2025
Also Read: పోలీస్ పతాకాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికి?
Also Read: భార్య నగ్న వీడియోలు స్నేహితులకు పంపిన భర్త.. చివరికి ఏమైందంటే!