Bandi Sanjay: నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కొడుకుకు సమయం ఇవ్వకుండా తప్పు చేశానంటూ వాపోయారు.

New Update
Bandi Sanjay

Bandi Sanjay

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష పడాల్సిందేనన్నారు. '' నా సమయాన్ని సమాజానికే ఇచ్చాను. నా కొడుకుకు మాత్రం టైం ఇవ్వలేకపోయాను. నా కొడుకును క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు.

Also Read: అలాంటి నేతలకు నో టికెట్.. కేసీఆర్ సీరియస్ వార్నింగ్!

కానీ నేను నా కొడుకును నేను సమర్ధించడం లేదు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాను. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తాం. నా కొడుకు తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. నా భార్య సైతం నన్ను ఫాలో అవుతోంది. నేనున్నా లేకున్నా కార్యకర్తలకు చేతనైనంత సాయం చేస్తోంది.  ఈరోజు నా కుటుంబానికి నిప్పంటించారు. ఆ నిప్పుతో అవినీతి వ్యవస్థను దగ్దం చేస్తా. అవినీతి, కుట్రలు చేసే గడీల బద్దలు కొడతాను. నన్ను, నా కుటుంబాన్ని, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని విడిచి పెట్టే ప్రసక్తే లేదు.

కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతూనే ఉన్నా.  అయినా బాధపడను. ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నా. నా కొడుకుకు టైమివ్వకుండా నేను తప్పు చేశాను. తప్పు నాదే.. నన్ను క్షమించండి. తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. దీన్ని నిరూపించుకోవాలని అతడికి చెప్పాను. నా చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని'' బండి సంజయ్ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు